Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 343-4
సంపుటము: 4-253
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
నీవే దయసేసి నేఁడు మమ్ముఁ గాతుగాక
శ్రీవల్లభుఁడ నీకు సేవ సేసే వారమా
॥పల్లవి॥
యిదిపుణ్య మిది పాప మెట్టని తెలిసేమయ్య
అదన నన్నపు నామే యన్నువట్టెను
యిదెదైవ మిదెగురుఁ డెట్టని యెరిఁగేమయ్య
మొదల నానాయోనిముట్టంటువారము
॥నీవె॥
ఆచారమేది యిఁక ననాచారమేదయ్య
కాచినయాఁకటికరిగాపులము
యేచినబంద మిది మోక్ష మిది యనలేమయ్య
పూచినపంచేంద్రియాలపొరుగైతి మిదివో
॥నీవె॥
ముంద రిది వెన కిది ముట్టి యేమనెంచేమయ్య
కందువసంసారపుగర్వ మెక్కెను
అందపు శ్రీవేంకటేశ యన్నియు నీమాయ లివి
పొంది నీకొప్పనసేసి భోగించేమయ్య
॥నీవె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము