అధ్యాత్మ సంకీర్తన
రేకు: 30-6
సంపుటము: 1-187
రేకు: 30-6
సంపుటము: 1-187
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| కుడుచుఁ గాక తనకొలఁది గాని మేలు [1]దడవీనా నోరు తగిన [2]యెంతయును | ॥కుడుచు॥ |
| చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ది గంప [3]గమ్మక తన్ను గాచీనా పంపుడుదయ్యమై బాధఁ [4]బెట్టెడు యాస కొంపలోన నుండ[5]నీఁగోరీనా | ॥కుడుచు॥ |
| శ్రీవేంకటగిరిశ్రీనాథుఁ డిందరిఁ గావఁ బ్రోవఁగనున్న ఘనుఁడు దేవోత్తముని నాత్మఁ దెలియ కితరములయిన త్రోవ లెన్నిన మేలు దొరకీనా | ॥కుడుచు॥ |
[1] ‘దడవి నానోరు’ పూ.ము.పా.
[2] ‘యంత’ కావచ్చు.
[3] ‘నమ్మక’ కావచ్చు.
[4] బెట్టెడు + ఆస =బెట్టెడుయాస. ఈ వింతసంధులకు ఈవాఙ్మయమున పట్టింపు లేదు.
[5] ఇవ్వన్ + కోరీనా =ఈఁగోరీనా కావచ్చు.


