అధ్యాత్మ సంకీర్తన
రేకు: 344-1
సంపుటము: 4-256
రేకు: 344-1
సంపుటము: 4-256
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ- పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు | ॥పల్లవి॥ |
| గోపికానాథ గోవర్ధనధరా శ్రీపుండరీకాక్ష జితమన్మథా పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా నీపాదములే మాకు నిధినిధానములు | ॥ఎదు॥ |
| పురుషోత్తమా హరీ భువనపరిపాలకా కరిరాజవరద శ్రీకాంతాధిప మురహరా సురవరా ముచుకుందరక్షకా ధరణి నీపాదములె తల్లియును దండ్రి | ॥ఎదు॥ |
| దేవకీనందనా దేవేంద్రవందితా కైవల్యనిలయ సంకర్షణాఖ్య శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా కావ నీపాదములె గతి యిహముఁ బరము | ॥ఎదు॥ |


