అధ్యాత్మ సంకీర్తన
రేకు: 344-3
సంపుటము: 4-258
రేకు: 344-3
సంపుటము: 4-258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పళవంజరం
| వెఱపించబోయి తానె వెఱచెఁ దల్లి యశోద మఱచి యీబాలు నెట్టు మానిసెంటా నుండెనో | ॥పల్లవి॥ |
| వెంట రాకుమని కృష్ణు వెరపించి యశోద వొంటి మందలో గొంగ వున్నాఁడనె అంటి గొంగ యెందునున్నాఁడని నోరు దెరచితే పెంటలై బ్రహ్మాండాలు పెక్కు గానవచ్చెను | ॥వెఱ॥ |
| చందమామఁ బాడి తల్లి సరిఁ బొత్తుకు రమ్మంటే చందురుఁ జూచి కృష్ణుఁడు సన్నసేసెను ముందరఁ జంద్రుఁడు వచ్చి మొక్కితే యశోద చూచి ముందేలా యంటినో యని ముంచి వెరగందెను | ॥వెఱ॥ |
| పాలార్చి తొట్టెలలోఁ బండఁబెట్టి యశోద నీలవర్ణుఁ దొంగిచూచె నిద్దురో యని వోలి శంఖచక్రాలతో నురము శ్రీసతితోడ యీలీల శ్రీవేంకటేశుఁడై యున్నాఁడు | ॥వెఱ॥ |


