అధ్యాత్మ సంకీర్తన
రేకు: 344-6
సంపుటము: 4-261
రేకు: 344-6
సంపుటము: 4-261
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| హరి సర్వాత్మకుఁ డాదిమపురుషుఁడు పొరి నెరుఁగువారి పుణ్యము గాన | ॥పల్లవి॥ |
| నాలుకకొననే నారాయణుఁడిదె వైళము దలఁచనివారిదె పాపము నేలయు మిన్నును నిజవైకుంఠము పోలించి చూడని పురుషుల వెలితి | ॥హరి॥ |
| మనసులోననే మాధవుఁడున్నాఁడు కనుఁగొనని వారికడ మింతే తనువే విష్ణుని తత్వసాధనము వొనరఁగ శ్రీపతి యున్నాఁడుగాన | ॥హరి॥ |
| చేరువ నిదివో శ్రీవేంకటపతి ధారుణిఁ గొలిచేటి దాసులభాగ్యము కారణ మితఁడే కలిగినదైవము కోరినవారల కొంగులపసిఁడి | ॥హరి॥ |


