Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 345-2
సంపుటము: 4-263
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
నర(వ?)రూప ప్రహ్లాదనరసింహా
అవిరళతేజ ప్రహ్లాదనరసింహా
॥పల్లవి॥
పగరపై కోపము బంటుఁజూచి మరచితి
నగుమొగము ప్రహ్లాదనరసింహా
యెగువ నీకోపమున కితఁడె మాఁటుమందు
అగపడె మాకును ప్రహ్లాదనరసింహా
॥నర॥
అంటముట్టరానికోప మంగనఁ జూచిమానితి
నఁటుచెల్లుఁ బ్రహ్లాదనరసింహా
జంట నీ బుద్ది తిప్ప సతియె యంకుశము
అంటు వాయమిఁకను ప్రహ్లాదనరసింహా
॥నర॥
ధర మొరవెట్ట దేవతలే మొక్కితే మానితి
గరుడాద్రఁ బ్రహ్లాదనరసింహా
యిరవై శ్రీవేంకటాద్రి నిందు నందు నీదె సుద్ది
అరసితి మిదివో ప్రహ్లాదనరసింహా
॥నర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము