అధ్యాత్మ సంకీర్తన
రేకు: 346-2
సంపుటము: 4-269
రేకు: 346-2
సంపుటము: 4-269
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
| మీ మతము పరిభాష మీ వల్లనే పుట్టెఁ గాక యే మునులైనాఁ దొల్లి యెంచిరా యీ మాఁట | ॥పల్లవి॥ |
| ముడిగి నాలుగు సూత్రములె మీ వివరణము కడమ వ్యాససూత్రాలు కల్లలా యేమి కడు ముఖ్యము మహావాక్యమే చాలుననెను అడరి వసిష్ఠాదు లాడిరా యీమాఁట | ॥మీమ॥ |
| తానె బ్రహ్మమనంటె తగ జీవన్ముక్తెనేరు పూని లోకులెల్లా ముక్తిఁ బొందవలెఁగా పాని కర్మానుభవాలు బాధితాను వృత్తనేరు వీనుల సర్వపురాణాలు వింటిమా యీమాఁట | ॥మీమ॥ |
| పైకొని బ్రహ్మజ్ఞానము భక్తిరూపము గాదని చేకొని కొచ్చెదరట్టె శ్రీవేంకటేశు దీకొనుచుఁ జేసేరు దేవపూజాది యజ్ఞాలు యేకాత్మవాదులాల యితవా యీమాట- | ॥మీమ॥ |


