అధ్యాత్మ సంకీర్తన
రేకు: 346-3
సంపుటము: 4-270
రేకు: 346-3
సంపుటము: 4-270
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| చెప్పఁబోతే యీ యర్థము చిత్తము వొడఁబడదు తప్పులు వెదకకురో తత్వజ్ఞులాల | ॥పల్లవి॥ |
| చెలఁగి మిథ్య యంటాఁ జేసేయజ్ఞాలు ఫలించునా యిల శూన్యోపాసకుల కేడ దేవుఁడు లలి మాయా శబళితులకు మోక్ష మెక్కడిది నలి నభేదవాది కానందానుభవ మేది | ॥చెప్పఁ॥ |
| హరి శరణుచొరనియట్టివారికి దిక్కేది గురుఁడు వేరే లేఁడట కోరి వుపదేశమేది వెరసి శిఖాసూత్రాలు విడిచితే ప్రణవమేది పరగ భక్తి లేదట భవమేట్టు గడచె | ॥చెప్పఁ॥ |
| శ్రీవేంకటేశుముద్ర ధరించక వైకుంఠమేది యీ విభుపేరు జపించకెట్టు పాపా లుత్తరించు వేవేగ దాసుఁడుగాక వెట్టికేల కరుణించు సేవించినఁగాక సర్వచింతలేల యుడుగు | ॥చెప్పఁ॥ |


