అధ్యాత్మ సంకీర్తన
రేకు: 31-2
సంపుటము: 1-189
రేకు: 31-2
సంపుటము: 1-189
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఏల పొరలేవులేవే యింతలోని పనికి మాలయింటితోలుకప్పు మాయ లిటువంటివి | ॥ఏల॥ |
| చిక్కుల తమకముల చీఁకటి గప్పిన నాఁడు యెక్కువ వాసనలౌ[1] హేయపుమేను వెక్కసపు ప్రియమది[2] విరిగితే రోఁతలౌ లక్కపూఁత కపురు లీలాగు లిటువంటివి | ॥ఏల॥ |
| మించిన చిత్తములో మేలుగలిగిన నాఁడు యెంచరాని చవులౌ నెంగలిమోవి పెంచుకంటే కష్టమౌ ప్రియము దీరిన నాఁడు చంచలపు చిత్తముల చంద మిటువంటిది | ॥ఏల॥ |
| వెల్లిగొను సురతపువేళ[3] మరపుల యింపు కొల్లలాడుటౌ కొనగోరి తాఁకులు నల్లితిండౌ[4] మరి మీఁద మరగితే రోఁతలౌ(?) వుల్లమిచ్చే వేంకటేశు వొద్ది కిటువంటిది | ॥ఏల॥ |
[1] నిడురేకు 83- సనదౌను.
[2] నిడురేకు 83- ప్రేమమది. (1-2 చరణములు వెనుకముందై కలవు)
[3] నిడురేకు 83- వెడమర.
[4] నిడురేకు 83- డౌఁగాక నలగిన నింతలోనే.


