అధ్యాత్మ సంకీర్తన
రేకు: 347-4
సంపుటము: 4-277
రేకు: 347-4
సంపుటము: 4-277
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| రాముఁడు లోకాభిరాముఁ డందరికి రక్షకుఁ డీతనిఁ దెలిసి కొలువరో కామితఫలదుఁడు చరాచరములకుఁ గర్తయైన సర్వేశ్వరుడితఁడు | ॥పల్లవి॥ |
| తలఁప దశరథుని తనయుఁడట తానెతారకబ్రహ్మమట వెలయ మానుషపు వేషమట వెగటుగ హరువిల్లు విరిచెనట అలరఁగ తానొక రాజట పాదాన నహల్యశాపము మాన్చెనట సొలవక దైవికమానుషలీలలు చూపుచు మెరసీఁ జూఁడరోయితఁడు | ॥రాము॥ |
| జగతి వసిష్ఠునిశిష్యుఁడట జటాయువుకు మోక్ష మిచ్చెనట అగచరులే తనసేనలట అంబుధి కొండలఁగట్టెనట మగువకొరకుఁగానట కమలాసను మనుమనిఁ రావణుఁ జంపెనట తగ లౌకికి వైదికములునొక్కట తానొనరించీఁ జూడరో యితఁడు | ॥రాము॥ |
| వెస నమరుల వరమడిగెనట విభీషణపట్టము గట్టెనట యెసగ నయోధ్యకు నేలికట యింద్రాదులకుఁ గొలువిచ్చెనట పొసగ శ్రీవేంకటగిరి నివాసమట భువనము లుదరంబున ధరించెనట సుసరపుసూక్ష్మాధికములు తనందుఁ జూపుచునున్నాఁడు చూడరో యితఁడు | ॥రాము॥ |


