అధ్యాత్మ సంకీర్తన
రేకు: 349-1
సంపుటము: 4-285
రేకు: 349-1
సంపుటము: 4-285
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| జగతి వైశాఖశుద్ధచతుర్దశి మందవార- మగణితముగఁ గూడె నదె స్వాతియోగము | ॥పల్లవి॥ |
| పక్కన నుక్కుఁగంభము పగిలించుక వెడలి తొక్కి హిరణ్యకసిపుఁ దొడికిపట్టి చక్కఁగాఁ గడపమీఁద సంధ్యాకాలమున వక్కలు సేసె నురవడి నరసింహుఁడు | ॥జగ॥ |
| పిప్పిగాఁగఁ జప్పరించి పేగులు జందేలు వేసి తొప్పఁదోఁగుచు నెత్తురు దోసిటఁ జల్లె రొప్పుచుఁ గోపముతోఁ గేరుచుఁ బకపకనవ్వి తప్పక చూచె వాని నుదగ్రనరసింహుఁడు | ॥జగ॥ |
| యెదుటఁ బ్రహ్లాదుఁ జూచి యిందిరఁ దొడపై నుంచె అదన నందరికి నభయమిచ్చె కదసి శ్రీవేంకటాద్రిగద్దెమీఁదఁ గూచుండె వెదచల్లెఁ గృపయెల్ల వీరనరసింహుఁడు | ॥జగ॥ |


