అధ్యాత్మ సంకీర్తన
రేకు: 349-6
సంపుటము: 4-290
రేకు: 349-6
సంపుటము: 4-290
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ధర్మమునకే మము దయఁ గావవే యిఁక నిర్మలుఁడవు నిను నే మెరిఁగేమా | ॥పల్లవి॥ |
| కాయధారులము కర్మలోలులము మాయ కగపడినమనుజులము పాయపుమదమున భ్రమసే మా మనసు నీయెడఁ దగులై నిలిచీనా | ॥ధర్మ॥ |
| చాపల్యగుణము జడులమన్నిటాను పాపపుణ్యసంబద్ధులము పైపైఁగోర్కుల ప్రబలేమాబ్రదుకు యేపనులకు నీకెక్కీనా | ॥ధర్మ॥ |
| అతిప్రాకృతులము అహంకారులము సతతంబునుఁ జంచలులము హితవుగ శ్రీవేంకటేశ యేలితివి తతితో నీభక్తి తగ మరచేమా | ॥ధర్మ॥ |


