అధ్యాత్మ సంకీర్తన
రేకు: 350-2
సంపుటము: 4-292
రేకు: 350-2
సంపుటము: 4-292
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
| చిత్తజగురుఁడ వో శ్రీ నరసింహా బత్తి సేసేరు మునులు పరికించవయ్యా | ॥పల్లవి॥ |
| సకలదేవతలును జయవెట్టుచున్నారు చకితులై దానవులు సమసి రదె అకలంకయగు లక్ష్మి యటు నీ తొడపై నెక్కె ప్రకటమైన నీ కోపము మానవయ్యా | ॥చిత్త॥ |
| తుంబురునారదాదులు దొరకొని పాడేరు అంబుజాసనుఁ డభయమడిగీ నదె అంబరవీధి నాడేరు యచ్చరలందరుఁ గూడి శంబరరిపుజనక శాంతము చూపవయ్యా | ॥చిత్త॥ |
| హత్తి కొలిచే రదె యక్షులును గంధర్వులు చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా | ॥చిత్త॥ |


