అధ్యాత్మ సంకీర్తన
రేకు: 31-4
సంపుటము: 1-191
రేకు: 31-4
సంపుటము: 1-191
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| [1]బ్రహ్మఁ గడిగిన పాదము బ్రహ్మము దానె నీపాదము | ॥బ్రహ్మ॥ |
| చెలఁగి వసుధ [2]గొలిచిన నీపాదము బలితల మోపిన పాదము తలఁకక గగనము దన్నిన పాదము బలరిపుఁ గాచిన పాదము | ॥బ్రహ్మ॥ |
| కామిని పాపము గడిగిన పాదము పాముతల నిడిన పాదము ప్రేమపు శ్రీసతి [3]పిసికెడి పాదము పామిడి[4] తురగపుఁ పాదము | ॥బ్రహ్మ॥ |
| పరమయోగులకుఁ బరిపరి విధముల పరమొసఁగెడి నీపాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీపాదము | ॥బ్రహ్మ॥ |
[1] ఈపాటలో ‘నీపాదము’ అనుట ఉచితమేమో? ‘ఈపాదము’ అని గాయకులు పాడుట గలదు.
[2] ‘గొలచి’ రేకు.
[3] ‘పిసికేటి’ రేకు.
[4] నిడురేకు 86- పామెడి.


