అధ్యాత్మ సంకీర్తన
రేకు: 351-2
సంపుటము: 4-298
రేకు: 351-2
సంపుటము: 4-298
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పళవంజరం
| ఇతఁడొకఁడే సర్వేశ్వరుఁడు సితకమలాక్షుఁడు శ్రీవేంకటేశుఁడు | ॥పల్లవి॥ |
| పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదుల కైశ్వర్యము గరిమ గొల్లెతల కాఁగిటిసౌఖ్యము సిరలొసఁగేటియీ శ్రీవేంకటేశుఁడు | ॥ఇత॥ |
| కలిగి యశోదకు కన్నమాణికము తలఁచినకరికిని తగుదిక్కు అలద్రౌపదికిని యాపద్భంధుడు చెలరేఁగినయీ శ్రీవేంకటేశుఁడు | ॥ఇత॥ |
| తగిలినమునులకు తపములసత్ఫలము ముగురువేలుపులకు మూలము వొగి నలమేల్మంగకొనరిన పతితఁడు జిగిమించినయీ శ్రీవేంకటేశుఁడు | ॥ఇత॥ |


