అధ్యాత్మ సంకీర్తన
రేకు: 351-4
సంపుటము: 4-300
రేకు: 351-4
సంపుటము: 4-300
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
| దేవతలఁ గాచిన దేవుఁ డితఁడు వేవులు ప్రతాపముల వీరరాముఁ డితఁడు | ॥పల్లవి॥ |
| రావణుఁజంపి పుష్పకరథ మెక్కి సీతతోడ ఠావుగా నయోధ్యను పట్టముగట్టుక వావిరి సుగ్రీవాదివానరకోట్లు గొలువ చేవమీరి పొగడొందు శ్రీరాముఁ డితఁడు | ॥దేవత॥ |
| వసుధ యింతయునేలి వసిష్ఠాదులు వొగడ యెసగ నశ్వమేధాలెల్లాఁ జేసి పొసఁగఁ గుశలవుల పుత్రులగా నటుగాంచి రసికత మించు దశరథరాముఁ డితఁడు | ॥దేవత॥ |
| అలర రుద్రునెదుటనటు విశ్వరూపు చూపి లలి బ్రహ్మవట్ట మనిలజుని కిచ్చి యిల శ్రీవేంకటాద్రినిరవై నిలిచినాఁడు చలము సాధించిన జయరాముఁ డితఁడు | ॥దేవత॥ |


