అధ్యాత్మ సంకీర్తన
రేకు: 351-6
సంపుటము: 4-302
రేకు: 351-6
సంపుటము: 4-302
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
| నిలచినవాఁడవు నీవేకాక దైవమా నెలవై ప్రకృతి నేను నీలోని సొమ్ములము | ॥పల్లవి॥ |
| తఱి నిరువదేను తత్వములుండఁగాను యెఱఁగని యజ్ఞానానకెవ్వరు గురి నెఱిఁ జైతన్యమెల్లా నీసొమ్మై వుండఁగాను యెఱుకవొక్కటేకాక యెవ్వరున్నా రీడను | ॥నిలి॥ |
| దినలెక్క లూరుపులు తెచ్చి తెచ్చి వొప్పించఁగ యెనలేని జన్మములకెవ్వరు గురి వునికై బ్రహ్మాండము వొళ్ళునీకై వుండఁగాను యేనసే ఆనందమేకా కెవ్వరున్నా రీడను | ॥నిలి॥ |
| అచ్చపు సుముద్రవంటాత్మ లణువైయుండగా యిచ్చఁ గామక్రోథాల కెవ్వరు గురి నిచ్చలు శ్రీవేంకటేశ నీవేలికవై యుండఁగా హేచ్చేటిదాస్యమేకాక యెవ్వరున్నా రీడను | ॥నిలి॥ |


