అధ్యాత్మ సంకీర్తన
రేకు: 352-2
సంపుటము: 4-304
రేకు: 352-2
సంపుటము: 4-304
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతం
| తల్లియాపె కృష్ణునికిఁ దండ్రి యీతఁడు చల్లఁగా లోకములెల్లా సంతోసమందెను | ॥పల్లవి॥ |
| అరుదై శ్రావణబహుళాష్టమినాటిరాత్రి తిరువవతారమందెను కృష్ణుఁడు యిరవై దేవకిదేవి యెత్తేకొని వసుదేవు - కరములందుఁ బెట్టితే కడుసంతోసించెను | ॥తల్లి॥ |
| తక్కక యమునానది దాఁటతఁడు రేపల్లెలో పక్కన యశోదాదేవిపక్కఁ బెట్టెను యెక్కువనాపె కృష్ణునినెత్తుక నందగోపుని గక్కన వినిపంచితే కడుసంతోసించెను | ॥తల్లి॥ |
| మరిగి పెద్దై కృష్ణుఁడు మధురలోఁ గంసుఁజంపి బెరసి యలమేల్మంగఁ బెండ్లాడి తిరమై శ్రీవేంకటాద్రిని దేవకీదేవియు ఇరవై తే వసుదేవుఁ డేఁచి సంతోసించెను | ॥తల్లి॥ |


