అధ్యాత్మ సంకీర్తన
రేకు: 352-3
సంపుటము: 4-305
రేకు: 352-3
సంపుటము: 4-305
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళం
| కరుణానిధివి గట్టుకో యే పుణ్యమైన శరణాగత వజ్రపంజరుఁడవు నీవు | ॥పల్లవి॥ |
| మన్నించేనంటే నిన్ను మానిపేవా రెవ్వరు పన్ని కోపగించితే నీపట్టుకెదు రెవ్వరు చెన్నుమీర నీపెట్టుజెట్లే జీవులెల్లాను వన్నెగా నీసొమ్ము నీవువలసినట్టు సేయి | ॥కరు॥ |
| కాచేనంటే నిన్నుఁ గాదనేవా రెవ్వరు ఏచి యాజ్ఞవెట్టేనంటే యిదేలనేవా రెవ్వరు లాచి పెంపుడుగుఱ్ఱలు లలినీజీవులెల్లాను చేచేత నీదాసులను సేసినట్టుసేయి | ॥కరు॥ |
| పరమిచ్చేనంటే నడ్డపడేవా రెవ్వరు సరి నిహమిచ్చేనంటే సాధించేవా రెవ్వరు సిరుల శ్రీవేంకటేశ చేతిలోవారము నీకు హరి నీపాఁతవారమెట్టైనా దయసేయి | ॥కరు॥ |


