అధ్యాత్మ సంకీర్తన
రేకు: 31-5
సంపుటము: 1-192
అవతారాలు
రేకు: 31-5
సంపుటము: 1-192
అవతారాలు
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన- లోనఁ బెట్టుకొని మాకు లోనైనవాఁడు | ॥తానే॥ |
| చదివించి, కూడువెట్టి, జారకుండ నిల్లుగట్టి, బెదురులేని బుద్ధి పిన్ననాఁడే చెప్పి, యెదిరి నడిగి, ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి, పదిలమై తమ్ముఁ బాలించువాఁడు, | ॥తానే॥ |
| మోహవియోగమ్ము, మోహానురాగమ్ము, దేహవిభాగంబు దెలిపిన కలికి ఐహికమున వేంకటాధీశుఁడై సర్వ- దేహరక్షకుఁడై తిరుగుచున్నాఁడు | ॥తానే॥ |
[1] ఈ పాటలో మాత్రము దశావతారసమన్వయమున్నట్లు రేకు చెప్పినది.


