అధ్యాత్మ సంకీర్తన
రేకు: 353-1
సంపుటము: 4-309
రేకు: 353-1
సంపుటము: 4-309
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భల్లాటి
| పెదయౌబళపుఁ గొండఁ బెరిగీనిదే వదలక కొలిచితే వరములిచ్చీని | ॥పల్లవి॥ |
| పదివేలశిరసుల బలునరసింహము గుదిగొన్నచేతుల గురుతైనది ఎదుటఁ బాదాలుఁ గన్నులెన్నైనఁ గలిగినది యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది | ॥పెద॥ |
| ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది మొనసి రాకాసిమెకములఁ గొట్టేది కనకపుదైత్యుని కడుపుచించినది తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది | ॥పెద॥ |
| శ్రీవనితఁ దొడమీఁదఁ జేకొని నిలిపినది దేవతలు గొలువ గద్దెపై నున్నది శ్రీవేంకటాద్రియందుఁ జెలఁగి భోగించేది భావించి చూచితేను పరబ్రహ్మమైనది | ॥పెద॥ |


