అధ్యాత్మ సంకీర్తన
రేకు: 353-6
సంపుటము: 4-314
రేకు: 353-6
సంపుటము: 4-314
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇన్నిటా నింతటా నిరవొకటే వెన్నుని నామమే వేదంబాయ | ॥పల్లవి॥ |
| నలినదళాక్షునినామకీర్తనము కలిగి లోకమునఁ గలదొకటే యిల నిదియే భజియింపఁగఁ బుణ్యులు చెలఁగి తలఁప సంజీవని యాయ | ॥ఇన్ని॥ |
| కోరిక నచ్యుత గోవిందాయని ధీరులు దలఁపఁగఁ దెరువొకటే ఘోరదురితహర గోవర్ధనధర నారాయణ యని నమ్మఁగఁగలిగె | ॥ఇన్ని॥ |
| తిరువేంకటగిరి దేవుని నామము ధరఁదలపగ నాధారమిదే గరుడధ్వజుని సుఖప్రదనామము నరులకెల్లఁ బ్రాణము దానాయ | ॥ఇన్ని॥ |


