Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 31-6
సంపుటము: 1-193
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
చెదఱక వెలుఁగే చేను మేయఁగఁ జొచ్చె
అదలించి తగదు నీ కనువారు వేరీ
॥చెదఱక॥
చిత్త మింద్రియములచేఁ జిక్కి, కడు | మద-
మెత్తిన వద్దన నిఁక వేరీ
హత్తిన మనసు మోహాదులతోఁ గూడి
తత్తరించిన మాన్పఁదగువారు వేరీ
॥చెదఱక॥
జీవుఁ డిన్నిటికిఁ దాఁ జిక్కి పోయినత్రోవఁ
బోవఁ జొచ్చిన బుద్ధిపొల మేది
శ్రీవేంకటేశుని చింతాపరతఁ గాని
కావఁగ నాత్మకు గతి దానేది
॥చెదఱక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము