అధ్యాత్మ సంకీర్తన
రేకు: 354-2
సంపుటము: 4-316
రేకు: 354-2
సంపుటము: 4-316
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| కటకట హరిమాయాకల్పనెట్టిదో తటుకునఁ బారవేసే తలఁపెందు లేదు | ॥పల్లవి॥ |
| అనంతకోటియుగాదులనుండియు తనివోక విషయాలఁ దగిలుండినా దినమొక్కొక్కరుచియై తీపులై పండీఁగాని వెనుకొన్న యాత్మకు వెగ టెందు లేదు | ॥కటకటా॥ |
| కడలేక నాలుకకుఁ గన్నయాహారములెల్ల వోడలిలోఁ బూఁటవూఁట వొట్టుకొనినా సడిఁ బైపై వింతవింతచవులే వెదకుఁగాని విడువని యాత్మకు వెగ టెందు లేదు | ॥కటకటా॥ |
| కలకాలముననుండి కాపురపు లంపటాలె కలిమితో మెడఁగుచ్చి కట్టుకొనినా యెలమితో శ్రీవేంకటేశ్వరునాజ్ఞల - నలవాటైన యాత్మకలపే లేదు | ॥కటకటా॥ |


