అధ్యాత్మ సంకీర్తన
రేకు: 354-3
సంపుటము: 4-317
రేకు: 354-3
సంపుటము: 4-317
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నటనల భ్రమయకు నామనసా ఘటియించు హరియే కలవాఁడు | ॥పల్లవి॥ |
| ముంచిన జగమిది మోహినీగజము పొంచినయాస పుట్టించే దిది వంచనల నిజమువలెనే వుండును మంచులు మాయలే మారునాఁడు | ॥నట॥ |
| సరిసంసారము సంతలకూటమి సొరిదిఁ బచారము చూపే దిది గరిమ నెప్పుడుఁ గలకలమనుచుండును మరులగువిధమే మాపటికి | ॥నట॥ |
| కందువదేహము గాని ముదియదిది అందినబహురూప మాడేదిది యెందును శ్రీవేంకటేశ్వరుఁడుండును డిందుపడఁగనిదె తెరమరఁగు | ॥నట॥ |


