అధ్యాత్మ సంకీర్తన
రేకు: 354-4
సంపుటము: 4-318
రేకు: 354-4
సంపుటము: 4-318
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| నిశ్చింతం పరమం సుఖ మనుమాటే నిజము నిజము తెలియరు గాని ఆశ్చర్యంబిది పరమయోగులకు ననుభవులకు దృష్టాంతము సుండీ | ॥పల్లవి॥ |
| కరచరణాదులుగలచైతన్యము గక్కునఁ బానుపుపైనుండి సరుగన సడిలిన నిద్రామందము సమకూడీ నరులకటువలెనే పరమాత్మునిపై సకలోద్యోగ వుపాయంబులు దా దిగవిడిచి ధరఁ దానుండిన బ్రహ్మానందము తనుఁదానే పైకొనుఁజుండీ | ॥నిశ్చిం॥ |
| వున్నతిఁ దానొక దేశములోపలనుండి క్రితముచూచిన నవియెల్లా అన్ని దేశములు నటుదలపోసిన యంతకుగోచరమైనట్లు యెన్నగఁబూర్వజ్ఞానంబున సర్వేశ్వరుఁడగు హరిఁదలఁచినను సన్నిధియగు సుజ్ఞానానందము సత్యము సత్యంబది సుండీ | ॥నిశ్చిం॥ |
| ననిచిన ప్రపంచకత్పములలో నానావిధముల జంతువులు తనుఁదాఁజూడగరానిరూపు లద్దములోపలఁ గన్నట్లు ఘనుడగు శ్రీవేంకటపతిరూపము గక్కన నెదుటనె సేవించి అనయము తనుఁదా సంతసించుటే యాత్మానందంబిది సుండీ | ॥నిశ్చిం॥ |


