అధ్యాత్మ సంకీర్తన
రేకు: 354-5
సంపుటము: 4-319
రేకు: 354-5
సంపుటము: 4-319
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఒసఁగితి విన్నియు నొకమాఁటే వెస నిఁకఁ జేసే విన్నపమేది | ॥పల్లవి॥ |
| నారాయణ నీనామము దలఁచిన - నీరానివరములిచ్చితివి చేరి నిన్ను నిటు సేవించిననిఁకఁ గోరి పడయ నిఁకఁ గోరికలేవి | ॥ఒస॥ |
| హరి నీకొకమరి యటు శరణంటే గరిమల నన్నిటు గాచితివి నిరతముగా నిఁక నిను నుతియింపుచు అరగొరతనివి నిను నడిగేదేదో | ॥ఒస॥ |
| శ్రీవేంకటేశ్వర చేయెత్తిమొక్కిన భావమే నీవై పరగితివి యీవరుసల నీవింతటిదాతవు ఆవలనినుఁ గొనియాడెడిదేమి | ॥ఒస॥ |


