అధ్యాత్మ సంకీర్తన
రేకు: 355-5
సంపుటము: 4-325
రేకు: 355-5
సంపుటము: 4-325
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని పాలుపడిన యీ జలభ్రమణమువలెను | ॥పల్లవి॥ |
| ధరలోఁ బుట్టినప్పుడే తలఁచ నీ యాత్మ మరుగఁడు పరమైతే మరచీఁగాని అరిది దుర్భాషల నలవడ్డనాలికె హరినామములయందు నలవడదు | ॥ఏలొ॥ |
| జవకట్టి పూర్వవాసనల సంసారమే చవియే తాఁగాని ముక్తి చవిగాదు భువిఁగల విషయాలఁ బుంగుడయ్యీఁగాని మతి వివరించి దైవమును వెదకలేదు | ॥ఏలొ॥ |
| శ్రీవేంకటేశుకృపచేత నింతేకాని వావాత నివి గైవశము గావు భావమిప్పుడితని పాదాలు చేరికాని యేవుపమలనుఁ గాన మిన్నాళ్లును | ॥ఏలొ॥ |


