Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 31-7
సంపుటము: 1-194
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
పోయఁ గాలం బడవికిఁ గాయు [1]వెన్నెలకరణిని
శ్రీయుతుఁ దలఁచుఁడీ నరులు మాయఁ బడి చెడక
॥పోయ॥
చిత్తము చేకూరుచుకొని చిత్తైకాగ్రతను
చిత్తజగురునిఁ దలఁచుఁడీ చిత్తజుఁ జొరనీక
॥పోయ॥
బూరుగుమాఁకునఁ జెందిన కీరముచందమున
అరయ నిష్పలమగు మరి యన్యులఁ జేరినను
॥పోయ॥
కూరిమి మా తిరువేంకటగిరిగురు శ్రీపాదములు
చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన
॥పోయ॥

[1] ‘వెన్నెలల’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము