అధ్యాత్మ సంకీర్తన
రేకు: 356-5
సంపుటము: 4-331
రేకు: 356-5
సంపుటము: 4-331
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| అందిచూడఁగ నీకు నవతారమొకటే యెందువాఁడవైతివి యేఁటిదయ్యా | ॥పల్లవి॥ |
| నవనీతచోరా నాగపర్యంకా సవనరక్షక హరీ చక్రాయుధా అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను నివలఁ గొడుకవనేదిది యేఁటిదయ్యా | ॥అంది॥ |
| పట్టపు శ్రీరమణా భవరోగవైద్య జట్టిమాయలతోడిశౌరి కృష్ణ పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి యెట్టని నమ్మవచ్చు నిది యేఁటిదయ్యా | ॥అంది॥ |
| వేదాంతనిలయా వివిధాచరణా ఆదిదేవ శ్రీవేంకటాచలేశ సోదించి తలఁచినచోట నీ వుండుదువట యేదెస నీ మహిమే యిదేఁటిదయ్యా | ॥అంది॥ |


