Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 356-6
సంపుటము: 4-332
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
తలపోఁత చిత్తమునఁ దరిగానక బుద్ధి
గలఁగెఁ గావవో మమ్ముఁ గర్మమా
॥పల్లవి॥
పాపజాతిమేనితోడఁ బడ్డపాటే చాలదా
ఆపదలకేల లోనాయ నిప్పుడు
దీపమైనహరిభక్తి దెలిసియింతటనైనఁ
గాపాడి పరమీవో కర్మమా
॥తల॥
చెప్పరానిసుఖములు చెప్పి చెప్పి కని కని
చప్పుడుగా లోకమునఁ జాటి చాటి
దెప్పరపుభవములఁ దిప్పుదీరైతి మిదె
కప్పుకొని కావఁగదో కర్మమా
॥తల॥
వేడుకలిన్నియు శ్రీవేంకటాద్రిరాయఁడే
కూడిన మాదైవమని కొనియాడి
యేడఁజూచిననుఁ బుణ్య మెక్కుడాయనని నమ్మి
గాడలెల్లాఁ బాసితిమి కర్మమా
॥తల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము