Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 32-1
సంపుటము: 1-195
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఏఁటికి నెవ్వరిపొందు యిస్సిరో చీచీ
నాటకములాల చీచీ నమ్మితిఁగా మిమ్మును
॥ఏఁటికి॥
జవ్వనమదమ చీచీ చక్కఁదనమరో చీచీ
రవ్వైన రాజసగర్వమరో చీచీ
కొవ్విన మదమ చీచీ కూరిమి యాసరో చీచీ
నవ్వుల దేహమ చీచీ నమ్మితిఁగా మిమ్మును
॥ఏఁటికి॥
ముచ్చట మమత చీచీ ముచ్చు మురిపెమ చీచీ
బచ్చురపణములోని బచ్చన చీచీ
తెచ్చుకోలు తాలిముల దిట్టతనమరో చీచీ
పుచ్చినపోకరో చీచీ పోయఁగా మీకాలము
॥ఏఁటికి॥
సిరుల చీఁకటి చీచీ సిలుగుసంపద చీచీ
వరవిభవమ చీచీ వాసిరో చీచీ
కరుణించెఁ దిరువేంకటగిరిపతి నన్ను
విరసవర్తన చీచీ వీడెఁగా మీభారము
॥ఏఁటికి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము