అధ్యాత్మ సంకీర్తన
రేకు: 358-2
సంపుటము: 4-340
రేకు: 358-2
సంపుటము: 4-340
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ఎన్నిటికెన్నిటికని యెక్కడఁ దగిలెదము మన్నించు దేవ మాకుఁ జాలు | ॥పల్లవి॥ |
| ముఖరమై మాఁకులకు మొదలఁబోసిననీరు శిఖలకుఁ దనువెక్కి చిగిరించినయట్టు నిఖిలప్రయోజనాలు నీమూలమేకాన మఖపతి మీసేవే మాకుఁజాలు | ॥ఎన్ని॥ |
| వరుసలనిన్నిటా వన్నె బంగారమే పరపరివిధముల పలుసొమ్ములైనట్లు నిరతిఁ గర్మఫలాలు నీమూలమేకాన మరుగురుఁడవు నీవే మాకుఁజాలు | ॥ఎన్ని॥ |
| వెలయ శ్రీవేంకటేశ వివిధజంతువులకు అలవిలేనిభూమే యధారమైనట్లు నెలవు దేవతలకు నీవేలికవుగాన మలసి నీశరణమే మాకుఁజాలు | ॥ఎన్ని॥ |


