అధ్యాత్మ సంకీర్తన
రేకు: 358-3
సంపుటము: 4-341
రేకు: 358-3
సంపుటము: 4-341
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| మాయలో మోహమున మరచితివిదే హరి వేయింటికి వింటే వివేకమా | ॥పల్లవి॥ |
| అంతటికినొడయఁడు అఖిలజీవులలోన అంతర్యామి శ్రీహరియట యింతటిలో నీకు హితబంధువులు వేరి వింతవారెవ్వరు నీకు వివేకమా | ॥మాయ॥ |
| అరయ నక్షరవాచి యతఁడట యిలలోనఁ బరమమంత్రాలెపో పలుకులెల్ల నిరతపునుతి యేది నిందయేది యిందులోన వెరవెరఁగవుగాక వివేకమా | ॥మాయ॥ |
| మొదలను నడుమను ముగిసినర్థములందు యెదుటను శ్రీవేంకటేశుఁడట యిది యది యననేల యిఛ్ఛాద్వేషమేల వెదకుము సమబుద్ధి వివేకమా | ॥మాయ॥ |


