అధ్యాత్మ సంకీర్తన
రేకు: 358-4
సంపుటము: 4-342
రేకు: 358-4
సంపుటము: 4-342
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట యెంత - చందమాయఁ జూడరమ్మ చందమామ పంట | ॥పల్లవి॥ |
| మునుపఁ బాలవెల్లి మొలచి పండినపంట నినుపై దేవతలకు నిచ్చపంట గొనకొని హరికన్నుఁగొనచూపులపంట వినువీధినెగడినవెన్నెలలపంట | ॥సందె॥ |
| వలరాజుపంపున వలపువిత్తినపంట చలువై పున్నమనాఁటి జాజరపంట కలిమికామినితోడ కారుకమ్మినపంట మలయుచుఁ దమలోనిమఱ్ఱిమానిపంట | ॥సందె॥ |
| విరహులగుండెలకు వెక్కసమైనపంట పరగ చుక్కలరాసిభాగ్యముపంట అరుదై తూరుపుఁగొండ నారఁగ బండినపంట యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట | ॥సందె॥ |


