Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 32-2
సంపుటము: 1-196
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం[1]
మనుజుఁడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా
॥మనుజు॥
జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెఁడు గూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరఁడు గాన
॥మనుజు॥
అందరిలోఁ బుట్టి అందరిలోఁ [2]బెరి-
గందరి రూపము లటు దానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరాని పదమందె నటు గాన[3]
॥మనుజు॥

[1] నిడురేకు 84- గుండక్రియ.

[2] ‘జేరి అంద’ పూ.ము.పా.

[3] నిడురేకు 84- పదమందరాదా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము