అధ్యాత్మ సంకీర్తన
రేకు: 360-4
సంపుటము: 4-354
రేకు: 360-4
సంపుటము: 4-354
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
| భారకుఁ డతఁడే బంధువుఁ డతడే చేరితి మతనినే చెంచెలమేలా | ॥పల్లవి॥ |
| చెనకునాయుధము చేతఁ గలిగితే ఘననిర్భయుఁడై కడఁగీనట్ల అనంతాయుధుఁ డాతుమనుండఁగ వెనుకొని యెందుకు వెఱవఁగనేలా | ॥భార॥ |
| భువి నొకరాజునుఁ బొందుగఁ గొలిచిన యివల నచ్చికం బెరఁగఁడట భువనరక్షకుఁడె పొదిగొని యేలఁగ వివరించి యొరుల వేఁడఁగనేలా | ॥భార॥ |
| తోవ విధానము దొరకినయప్పుడే యేవిధములు మరి యెంచఁడట శ్రీ వేంకటపతి చేకొని కావఁగ భావన నితరోపాయములేలా | ॥భార॥ |


