అధ్యాత్మ సంకీర్తన
రేకు: 32-3
సంపుటము: 1-197
రేకు: 32-3
సంపుటము: 1-197
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట[1]
| లంకెలూడుటే లాభము యీ కింకరులను నలఁగెడి కంటెను | ॥లంకె॥ |
| జంపులఁ జంపక [2]సరుగనఁ బాసేటి లంపటమేపో లాభము [3]కంపమోపుతోఁ గనలి శరీరపు కొంపలోన వేఁగుట కంటెను | ॥లంకె॥ |
| యీవలనావల నేచేటి యాసల[4] లావు దిగుటేపో లాభము యేవగింతలకు నిరవగు నరకపు కోవులఁ బడి మునుఁగుట కంటెను | ॥లంకె॥ |
| తివిరి వేంకటాధిపు దాసుల కృప లవలేశమేపో లాభము చవులని[5] నోరికి సకలము దిని తిని భవకూపంబులఁ బడు కంటెను | ॥లంకె॥ |
[1] నిడురేకు 29- సామంతం.
[2] నిడురేకు 29- నొంపక.
[3] నిడురేకు 29- గంపమోపు.
[4] నిడురేకు 29- ఆవలనీవల నాసలుసేసెడి.
[5] చవికొని.


