అధ్యాత్మ సంకీర్తన
రేకు: 361-1
సంపుటము: 4-357
రేకు: 361-1
సంపుటము: 4-357
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| భళి భళి రామా పంతపు రామా నీ - బలిమి కెదురు లేరు భయహర రామా | ॥పల్లవి॥ |
| విలువిద్య రామా వీరవిక్రమ రామా తలకొన్న తాటకాంతక రామా కొలయై ఖరుని తలగుండుగండ రామా చలమరి సమరపు జయరామ రామా | ॥భళి॥ |
| రవికుల రామా రావణాంతక రామ రవిసుతముఖ కపిరాజ రామ సవరఁగాఁ గొండలచే జలధిగట్టిన రామ జవసత్త్వసంపన్న జానకీరామా | ॥భళి॥ |
| కౌసల్యరామా కరుణానిధి రామ భూసురవరద సంభూతరామా వేసాలఁ బొరలే శ్రీ వేంకటాద్రి రామ దాసులమమ్ముఁ గావఁదలకొన్న రామా | ॥భళి॥ |


