అధ్యాత్మ సంకీర్తన
రేకు: 361-2
సంపుటము: 4-358
రేకు: 361-2
సంపుటము: 4-358
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అన్నిటికి నిది పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము | ॥పల్లవి॥ |
| చిత్తశాంతికిని శ్రీ పతి నామమె హత్తిననిజ దివ్యౌషధము మొత్తపు బంధవిమోచనంబునకు చిత్తజ గురుఁడే సిద్ధౌషధము | ॥అన్నిటి॥ |
| పరిపరి విధముల భవ రోగములకు హరిపాద జలమె యౌషధము దురితకర్మములఁ దొలఁగించుటకును మురహర పూజే ముఖ్యౌషధము | ॥అన్నిటి॥ |
| యిల నిహపరముల నిందిరావిభుని - నలరి భజింపుటె యౌషధము కలిగిన శ్రీ వేంకటపతి శరణమే నిలిచిన మాకిది నిత్యౌషధము | ॥అన్నిటి॥ |


