అధ్యాత్మ సంకీర్తన
రేకు: 361-4
సంపుటము: 4-360
రేకు: 361-4
సంపుటము: 4-360
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| బల్లిదులు నీకంటెఁ బరులున్నారా నన్నుఁ దొల్లిటి బారి నింకఁ దోయకు మో యయ్య | ॥పల్లవి॥ |
| చిక్కుల భవములఁ జెరఁజిక్కి వోపలేక నిక్కి నీమరఁగు చొచ్చి నిలిచితిని అక్కజమై యల్లనాఁడే అప్పులకర్మములెట్ల ఇక్కడనె చుట్టుముట్టీ నేమిసేతునయ్యా | ॥బల్లిదు॥ |
| లచ్చి సంసారమునకు లగ్గమచ్చి తీరలేక యిచ్చట నిన్నుఁగొలిచి యెక్కువై తిని పొచ్చముల నల్లనాఁటిపూఁట దీరదని కొన్ని బచ్చన బంధాలు వచ్చెఁ బాఁపగదవయ్య | ॥బల్లిదు॥ |
| అంచల నింద్రియముల కరివెట్టి పెట్టలేక ముంచి నీ పాదాలకు మొరవెట్టితి పొంచిన శ్రీవేంకటేశ భువన రక్షకుఁడవు పంచల నున్నాఁడ నన్నుఁ బాలించవయ్యా | ॥బల్లిదు॥ |


