అధ్యాత్మ సంకీర్తన
రేకు: 362-2
సంపుటము: 4-364
రేకు: 362-2
సంపుటము: 4-364
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అల్లదెకో విజయధ్వజము జగ - మెల్లఁ జేకొనియె నీతఁడు | ॥పల్లవి॥ |
| తొక్కనిచోట్లు దొక్కెటి తురగపు రెక్కలమీఁదటి రేవంతుఁడు చక్కుగ నసురల సంహరించి యిదె దిక్కులు గెలిచెను దేవదేవుడు | ॥అల్లదె॥ |
| వోడక శంఖము నొగి చక్రముతో సూడుకుఁ దిరిగేటి శూరుఁడు యీడనుండి సురలిందరిఁ గాచెను మేడెపు మన లక్ష్మీ విభుఁడు | ॥అల్లదె॥ |
| శరణన వారలఁ జయ్యన గాచిన శరణాగత రక్షణ ఘనుఁడు తిరమై యింతకు దిక్కై నిలిచెను గరిమెల శ్రీ వేంకట విభుఁడు | ॥అల్లదె॥ |


