అధ్యాత్మ సంకీర్తన
రేకు: 362-3
సంపుటము: 4-365
రేకు: 362-3
సంపుటము: 4-365
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఎక్కడ నీ వుద్యోగ మెటు విచ్చేసేవయ్యా యిక్కువ నీమహిమకు నెవ్వ రెదురయ్యా | ॥పల్లవి॥ |
| పల్లించి గరుడనిపై నీ వుబ్బుననెక్క అల్లనాఁడె పారిజాత మడవికెక్కె పల్లదపురుద్రుఁడును బాణునివాకిలి దొక్కె చుల్లరి రాక్షసమూఁక సురసుర సుక్కె | ॥ఎక్కడ॥ |
| గరుడినిపై నీవు కడుఁబేరెములవార ధరజలధరుల నమృతములు దేరె నిరతిఁ గంసాదులనెత్తురు టేరులు వారె పరులు నీకెదిరిన పగయెల్ల దీరె | ॥ఎక్కడ॥ |
| బంగారు గరుడనిపై నీవు వీదులేఁగ చెంగట శ్రీ వేంకటేశ సిరులుమూఁగె సంగతి నలమేల్మంగ సంతసాన విఱవీగె పొంగారు దేవదుందుభులు పై పై వాఁగె | ॥ఎక్కడ॥ |


