అధ్యాత్మ సంకీర్తన
రేకు: 32-4
సంపుటము: 1-198
రేకు: 32-4
సంపుటము: 1-198
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు [1]చంచలబుద్ధి మానీనా | ॥తన॥ |
| జడ్డుమానవుఁడు చదువఁ జదువ నాస వడ్డివారుఁ గాక వదలీనా గుడ్డికుక్క సంతకుఁ బోయి తిరిగిన దుడ్డుపెట్లే కాక దొరకీనా | ॥తన॥ |
| దేవదూషకుఁడై తిరిగేటివానికి దేవతాంతరము తెలిసీనా శ్రీవేంకటేశ్వరు సేవాపరుఁడుగాక పావనమతియై పరగీనా | ॥తన॥ |
[1] ‘చెంచెల’ రేకు.


