అధ్యాత్మ సంకీర్తన
రేకు: 362-4
సంపుటము: 4-366
రేకు: 362-4
సంపుటము: 4-366
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| సమమతినని నీవే చాటుదువు రమణ నేరుపు నేరము లెవ్వరిని | ॥పల్లవి॥ |
| రావణాదులైన రాక్షసమితిలో నీవే, దేవతలలో నీవేకావా భావింప నసురలు పగ నీకు నేలైరి యీవల సురులెల్ల హితులైరి | ॥సమ॥ |
| సకల జంతువులకుఁ జైతన్యుఁడవు నీవే వొకరు నీకుపరాక మొనరించేరా అకట కొందరిఁ బాపాత్ములఁగాఁ జేసి వెకలిఁ గొందరిఁ బుణ్యవిధులఁ జేసితివి | ॥సమ॥ |
| అటుగాన ఇట్టాయ నట్టాయనననేల యిటు నీచిత్తముకొలఁ దింతేకాక గటియించి శ్రీవేంకటపతి నీదాసు లిటువలె ఘనులై రిదివో నీకృపను | ॥సమ॥ |


