అధ్యాత్మ సంకీర్తన
రేకు: 362-6
సంపుటము: 4-368
రేకు: 362-6
సంపుటము: 4-368
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| తల లేదు తోఁక లేదు దైవమా నీ మాయలకు తెలిసియుఁ దెలియక తిరిగేము నేము | ॥పల్లవి॥ |
| తను వేఁటిదో యీ తలపోఁత లేఁటివో యెనయు సంసార సుఖ మిది యేఁటిదో వెనక ముం దేఁటిదో వివేక మెరఁగక దినదినమును నేమో తిరిగేము నేము | ॥తల॥ |
| పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో మట్టులేని హరి నిర్మాణ చక్రములోన దిట్టలమై యేమేమో తిరిగేము నేము | ॥తల॥ |
| నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో వూరకే నీ దాసులమై వున్నారము చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర గారవించి కరుణించి కావఁగదవే | ॥తల॥ |


