అధ్యాత్మ సంకీర్తన
రేకు: 363-3
సంపుటము: 4-371
రేకు: 363-3
సంపుటము: 4-371
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవశ్రీ
| ఇందుకుఁగా నా యెరఁగమి నేమని దూరుదును అందియు నిను నేఁ దెలియక అయ్యో నేనిపుడు | ॥పల్లవి॥ |
| ఆతుమలోననుండి యఖిలోపాయములు చేతనునకు నీవే చింతించఁగాను కాతురపడి నేను కర్తననుచుఁ బనులు యీతలఁ జెప్పఁగఁబూనే నిస్సిరో | ॥ఇందు॥ |
| తను విటు నీ వొసఁగి తగు భాగ్యము నీవై అనువుగ జీవుని నీయటు నీవేలఁగను తనియక నే వొరులు దాతలనుచుఁ బోయి కనుఁగొని వేడఁగఁ దొడఁగేఁ గటకటా | ॥ఇందు॥ |
| శ్రీవేంకటాద్రిపై నుండి చేరి కన్ను లెదుటను సేవగొని యిట్టే కృపసేయఁగాను సోవలఁ గన్నవారెల్లాఁ జుట్టములంటా నేను జీవులతోఁ బొందుసేసేఁ జెల్లఁబో | ॥ఇందు॥ |


