Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 32-5
సంపుటము: 1-199
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
[1]సడిబెట్టెఁ గటకటా సంసారము | చూడ-
జడధి లోపలి యీఁత సంసారము
॥సడి॥
జము నోరిలో బ్రదుకు సంసారము | చూడ
చమురు దీసిన దివ్వె సంసారము
సమయించుఁ బెనుదెవులు సంసారము చూడ
సమరంబులో నునికి సంసారము
॥సడి॥
సందిగట్టిన తాడు సంసారము చూడ
సందికంతల తోవ సంసారము
చుందురుని జీవనము సంసారము చూడ[2]
చంద మేవలెనుండు సంసారము
॥సడి॥
చలువలోపలి వేఁడి సంసారము చూడ
జలపూఁత బంగారు సంసారము
యిలలోనఁ దిరువేంకటేశ నీదాసులకు
చలువలకుఁ గడుఁ జలువ సంసారము
॥సడి॥

[1] ఈ పాటకు రేకులో ప్రగ్రహమునకు గుర్తు సరిగా చూపలేదు.

[2] నిడురేకు 80- గాక.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము