అధ్యాత్మ సంకీర్తన
రేకు: 364-2
సంపుటము: 4-376
రేకు: 364-2
సంపుటము: 4-376
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఇతరమెరఁగ గతి యిదియె శరణ్యము సతతపూర్ణునికి శరణ్యము | ॥పల్లవి॥ |
| సర్వలోకముల సాక్షైకాచిన - సర్వేశ్వరునకు శరణ్యము వుర్వికి మింటికి నొక్కటఁ బెరిగిన - సార్వభౌమునకు శరణ్యము | ॥ఇతర॥ |
| శ్రీకాంత నురముచెంగట నిలిపిన - సాకారునకును శరణ్యము పైకొని వెలిఁగేటి పరంజోతియై - సౌకుమారునకు శరణ్యము | ॥ఇతర॥ |
| తగనిహపరములు దాసుల కొసఁగేటి జగదీశ్వరునకు శరణ్యము నగు శ్రీ వేంకటనాథుఁడ నీకును సగుణమూర్తి యిదె శరణ్యము | ॥ఇతర॥ |


