అధ్యాత్మ సంకీర్తన
రేకు: 365-2
సంపుటము: 4-382
రేకు: 365-2
సంపుటము: 4-382
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
| ముట్టితేనే మూయైఁ బట్టితేనే పంతమయీ ఇట్టె మమ్ముఁ గావవే యిందిరారమణ | ॥పల్లవి॥ |
| తీరుగాఁ బుణ్యముసేసితే జన్మబంధమై తోరపు నాపాపములైతే దుఃఖమైని వూరకుంటే నీప్రపంచ ముల్లంఘించినట్లై యేరీతి నడచువార మిందిరారమణ | ॥ముట్టి॥ |
| అంకె దయఁ దలఁచితే నన్నిటికిఁ దగులై కొంకక కోపంచితేనే క్రూరమ్మైని మంకున నూరకవుంటే మదోన్మత్తుఁడై యింకనేమి సేయువార మిందిరారమణ | ॥ముట్టి॥ |
| యిన్ని చిక్కులునేల యిట్టె శ్రీ వేంకటేశ మిన్నక నీశరణంటే మేలైని వెన్నెల నీయర్థమే వేదశాస్త్రసమ్మతై యెన్న నీవే సేయువాఁడ విందిరారమణ | ॥ముట్టి॥ |


